ఒమిక్రాన్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు….

దేశంలో 141 కోట్ల టీకాల డోషులు పూర్తయ్యాయి….ఓమి క్రాన్ నివారణకు టీకాలు జాగ్రత్తలే మందు…

90% వయోజనులకు కోవిడ్ మొదటి డోసులు పంపిణీ పూర్తి….జనవరి 10 నుండి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు బూస్టర్ డోస్ ఇస్తాం…15 నుండి 18 ఏళ్ల వారికి జనవరి 3 నుండి టీకాల పంపిణీ.. 60 సంవత్సరాలు పైబడిన వారికి వైద్యుల సలహా మేరకు బూస్టర్ డోస్ ఇస్తాం..
ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు బూస్టర్‌ డోసు.. ప్రధాని మోదీ ప్రకటన

దిల్లీ ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయపెడుతున్న వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. జనవరి 10వ తేదీ నుంచి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు బూస్టర్‌ డోసు అందిస్తామని ప్రకటించారు. త్వరలో 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికీ టీకా పంపిణీ చేస్తామని చెప్పారు. శనివారం రాత్రి ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు…దేశంలో 90 శాతం వయోజనులకు కొవిడ్ టీకా తొలి డోసు పంపిణీ పూర్తయింది. ఒమిక్రాన్‌పై రకరకాల వార్తలు, వదంతులు వస్తున్నాయి. వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీ కోసం నిరంతరం పనిచేస్తున్నాం. ఆరోగ్య కార్యకర్తల అంకితభావం వల్లే టీకా పంపిణీ వడివడిగా సాగుతోంది. దేశంలో కరోనా ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదు అని మోదీ అన్నారు.

మన దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న వేళ అందరం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒమిక్రాన్‌ వస్తోందని ఎవరూ భయాందోళనకు గురికావొద్దన్నారు. ఒమిక్రాన్‌తో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. ఇవాళ దేశవ్యాప్తంగా 18 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. పిల్లలకు 90వేల బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశంలో ఔషధాలకు ఎలాంటి కొరతా లేదని చెప్పారు. దేశంలో సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు…

ఒమిక్రాన్‌ నివారణకు టీకాలు, జాగ్రత్తలే మందు అని మోదీ చెప్పారు. అనేక రాష్ట్రాల్లో 100 శాతం కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయిందన్నారు. కొత్త సంవత్సరం కోసం అంతా ఆతృతతో ఎదురుచూస్తున్నాం.. కానీ ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని అన్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం మరిచిపోవద్దని విజ్ఞప్తి చేశారు. వైద్య సిబ్బంది కఠోర శ్రమవల్లే 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందని చెప్పారు.
11 నెలలుగా దేశంలో వ్యాక్సినేషన్‌ ఉద్యమం కొనసాగుతోందన్నారు.

త్వరలో అందుబాటులోకిపిల్లల కొవిడ్ టీకా*

త్వరలో చిన్న పిల్లలకు కోవిడ్ టీకాలు

త్వరలోనే చిన్నారులకు  కొవిడ్‌ టీకా అందుబాటులోకి రానుంది. భారత్‌ బయోటెక్‌ కొవిడ్‌ టీకాకు డీసీజీఐ అనుమతి లభించింది.

అత్యవసర వినియోగానికి భారత్‌ బయోటెక్‌కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. 12 నుంచి 18 ఏళ్ల లోపు వయసుకలిగిన వారికి భారత్‌ బయోటెక్‌ కొవిడ్ టీకాను అభివృద్ధి చేసింది.