ఆన్ లైన్ గేమ్ బ్యాంక్ అకౌంట్ లో నుండి 50లక్షలు పోగొట్టుకున్న మహిళ..!

జూదం కన్నా ఆన్ లైన్ గేమ్ లు ప్రమాదకరంగా మారాయి. ఆన్ లైన్ గేమ్ లు మనుషులను బానిసలుగా మారుస్తున్నాయి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు ఆన్ లైన్ గేమ్(online game) లకు అడిక్ట్ అవుతున్నారు. చైనాలో ఆన్ లైన్ గేమ్ కు అలవాటు పడ్డ బాలిక.. తల్లి బ్యాంక్ అకౌంట్(bank account) నుంచి రూ.53 లక్షలను అపహరించి ఆన్ లైన్ గేమ్ లు ఆడి పోగొట్టుకున్నారు.13 ఏళ్ల బాలిక ఆనై లైన్ గేమ్ లకు బానిసగా మారారు. రోజూ ఫోన్ లో పే-టు-ప్లే గేమ్స్ ఆడుతూ తల్లి బ్యాంక్ అకౌంట్ లోని 449,500 యూవాన్(yvaan) లు( భారత కరెన్సీలో 52.19 లక్షల రూపాయలు) కేవలం నాలుగు నెలల్లోనే పోగొట్టుకున్నారు. బాలిక ఎప్పుడూ ఫోన్ లో ఆన్ లైన్ గేమ్ లు ఆడుతుండటాన్ని గమినించిన స్కూల్ టీచర్(shcool teacher) ఆమె తల్లి వాంగ్ కు విషయాన్ని చెప్పారు.తల్లికి అనుమానం కలగడంతో వచ్చి చూడగా కూతురు తన బ్యాంక్ లోని రూ.52.19 లక్షల రూపాయలు అపహరించి ఆన్ లైన్ గేమ్ లు(online game) ఆడినట్లు తెలిసి లబోదిబోమని మొత్తుకున్నారు. ప్రస్తుతం ఆమె అకౌంట్ లో కేవలం 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి.మొబైల్ గేమ్ కంపెనీలకు(mobaile game) చేసిన చెల్లింపులకు సంబంధించి పాస్ బుక్ లో నమోదైన ఎంట్రీలను చూపుతూ కూతురు నిర్వాకం గురించి తల్లి కన్నీటి పర్యంతమవుతున్నారు. బాలిక తనకే కాక, తన స్నేహితులకు కూడా తల్లి అకౌంట్ నుంచి డబ్బులు చెల్లిస్తూ ఆన్ గేమ్ లు ఆడటం గమనార్హం..