ఆన్‌ లైన్‌ గేమ్‌లు ఆత్మహత్యలకు దారి..! ఇద్దరి పిల్లల్ని సంపులో పడేసి.. తరువాత ప్రాణాలు తీసుకుంది ఓక తల్లి..!!.

8లక్షల అప్పుకు దారి తీసిన సరదా..!

ఆన్‌ లైన్‌ గేమ్‌లు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. సాలె గూటి పొగుల్లా సరదాగా సెల్‌ఫోన్‌లో మొదలైన ఆట కాస్తా చివరకు ఉరితాళ్లుగా మెడకు చుట్టుకుంటున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ ఆన్‌లైన్‌ గేమ్‌online gameలో పిల్లలు, యువత బలైనపోయారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం స్తానికంగా కలకలం రేపింది. మంగళవారం Tuesday సాయంత్రం జిల్లాలోని చౌటుప్పల్‌(Chautuppal)లో చోటుచేసుకుంది. మృతురాలు రాజేశ్వరి(Rajeshwari) ఆన్‌లైన్‌ గేమ్‌లో 8లక్షలు పోగొట్టుకుంది. గేమ్‌ కోసం తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేసింది. వాటిని తిరిగి ఇవ్వమని నిలదీయడంతో మనస్తాపానికి గురై ఇద్దరి పిల్లల్ని సంపులో పడేసి..అటుపై తాను దూసి ప్రాణాలు తీసుకుంది.

8లక్షల అప్పుకు దారి తీసిన సరదా ..వ్యసనాలు తొలుత సాలె గూటి పోగులు..తర్వాత ఉరితాళ్లు అన్న సామెత నిజమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో రాజేశ్వరి అనే వివాహిత ఇంట్లో ఉంటూ సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్స్‌లకు ఆకర్షితురాలైంది. ఇందులో భాగంగానే భర్త లారీ డ్రైవర్ కావడంతో అతను ఇంట్లో లేని సమయంలో గేమ్స్‌ ఆడేందుకు తెలిసిన వాళ్ల దగ్గర నుంచి అప్పుగా లక్షల రూపాయలు తీసుకుంది. వాటిని ఆన్‌లైన్‌ గేమ్‌లో పోగొట్టుకుంది. అయితే డబ్బు అప్పుగా ఇచ్చిన వాళ్లు తిరిగి ఇవ్వమని నిలదీయడంతో అప్పు తీర్చే మార్గం లేక..వాళ్లకు సమాధానం చెప్పుకోలేక ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది..