ఉక్రెయిన్ నుండి వస్తున్న విద్యార్ధుల బాధలు ఎలా ఉన్నాయి….ఆపరేషన్ గంగతో అభయహస్తం………


బాంబుల మోతతో దద్దరిల్లి పోయే.. ప్రదేశాలనుండి కళ్ళముందే పడి ఉన్న సేవలను దాటుకుంటూ.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటూ భారత్ చేరుకున్న వారి ఆవేదన ఇలా ఉంది…తల్లిదండ్రులను చూస్తామో లేదో.. మాతృభూమికి చేరుకుంటామో లేదో అనే టెన్షన్ వాళ్లది. భయపడకండి అంటూ..
ఉక్రెయిన్‌ గగనతలం మీద పౌర విమానాలు తిరిగే అవకాశం లేకపోవడంతో భారతీయ విద్యార్థులకు ఆదేశ సరిహద్దు వరకు రోడ్డు మార్గం ద్వారా రప్పించారు.. పొరుగు ఉన్న హంగేరి, రోమేనియా, పోలాండ్, స్లోవేకియా, మాల్టోవా దేశాల నుంచి ప్రత్యేక విమానాల్లో తీసుకొస్తున్నారు.. ఇందుకోసం ఆయా దేశాలల్లోని భారత రాయబార కార్యాలయాలు నిరంతరం పని చేస్తున్నాయి…..

వీరు బాధలు ఎలా ఉన్నాయంటే..

గడ్డ కట్టే చలి మరోవైపు. క్షణ క్షణం భయం.. భయం.. బోర్డర్ వరకూ వచ్చిన వాళ్లు.. సేఫ్‌గా స్వదేశానికి ల్యాండ్ అవుతున్నారు. రష్యా(Russia) దాడి తర్వాత ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కసరత్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే వేల సంఖ్య భారతీయ విద్యార్థలను భారత్‌కు తీసుకొచ్చారు. “ఆపరేషన్ గంగా” పేరుతో తరలింపు కార్యక్రమాన్ని చేపట్టింది భారత ప్రభుత్వం. ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థుల తరలింపు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు ప్రధాని మోదీ.. ఆపరేషన్‌ గంగా కోసం వాయుసేనను కూడా రంగంలోకి దించారు.. తక్కువ సమయంలో ఎక్కువ మందిని తీసుకువచ్చేందుకు సీ-17 విమానాన్ని ఉపయోగించనుంది వాయుసేన. స్వదేశానికి చేరుకున్న విద్యార్థుల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది…

ఆపరేషన్ గంగ పేరుతో తరలించిన విమర్శలే..

ఆపరేషన్ గంగా” పేరుతో భారత ప్రభుత్వం తరలింపు విజయవంతంగా చేస్తుంటే అక్కడి నుంచి వచ్చిన విద్యార్థులు కొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఉంటే ఇన్ని ఇబ్బందులు పడేవాళ్లం కాదు. మేం ఇప్పుడు ఇక్కడికి చేరుకొన్నాం.. కాబట్టి మీరు పువ్వులతో స్వాగతం పలుకుతున్నారు. రాకపోయి ఉంటే ఏం చేసేవారు? మా కుటుంబాలు ఏం అయిపోయేవి? ఈ పువ్వులను ఏం చేసుకోవాలి? దేనికి పనికివస్తాయి? సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోకుండా, మేం వచ్చిన తర్వాత పువ్వులతో స్వాగతం చెప్పడం ఏంటి? కేంద్రంపై బీహార్‌ విద్యార్థి దివ్యాంశు సింగ్‌ ఆగ్రహం చేశాడు.
మనం విదేశీ మారకద్రవ్యాన్ని తీసుకువచ్చినప్పటి నుండి దేశం మనకు రుణపడి ఉంటుందని మనం భ్రమించుకోమని కొందరు విదేశాల్లో ఉండే భారతీయులు అంటారు. మన కోసం, మన కుటుంబాల సంక్షేమం, ఆస్తిలో పెట్టుబడుల కోసం విదేశీ మారకద్రవ్యాన్ని పంపుతారు. మనలో ఎవ్వరూ ఉదయాన్నే లేచి ‘నేను భారతదేశానికి విదేశీ మారకద్రవ్యం పంపబోతున్నాను’ అని చెప్పరు….

అభినందించాల్సిందే పోయి ఆవేశంలో విమర్శలు గుప్పిస్తున్నారు అంటూ నుంచి వచ్చిన విద్యార్థులపై పలువురు అసంతృప్తి వ్యక్తం…

యుద్ధం జరుగుతుంది అని తెలుసు… యుద్ధం వల్ల నష్టం వాటిల్లుతుందని కూడా తెలుసు… ఇదే విషయం సుమారుగా రెండు నెలల నుంచి వార్తలు వస్తున్నాయి.. యుద్ధ ట్యాంకర్ లతో సహా బోర్డర్ కి వచ్చాయి అని కూడా తెలుసు కానీ సొంతడబ్బుతో రాకుండా అక్కడే ఎందుకు ఉన్నారు..?…. తల్లిదండ్రుల అయినా కనీసం విద్యార్థి డబ్బులు పంపించి ఇంటికి తెప్పించుకోవాలి చేసిన బాధ్యత లేదా..? తీర ప్రభుత్వమే సొంత ఖర్చుతో తెప్పిస్తే తెప్పించిన వారిపైనే అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… విద్యార్థులు కోపంతో ఉండడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని తెలిపారు……. మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశం విద్యార్థుల తరలింపులో అద్భుతంగా వ్యవహరించింది అంటూ విదేశాల్లో సైతం కూడా భారత్ ని ప్రశంసలతో ముంచెత్తిన వేస్తోంది..

ఆపరేషన్ గంగతో అభయహస్తం

కైవ్‌లోని ఈ భారతీయ రాయబార కార్యాలయం చేపట్టిన కార్యక్రమాన్నితప్పకుండా మెచ్చుకుని తీరాలి.. ఇలాంటి సమయంలో నిందలు వేయడం ఎంతవరకు సరైనది అంటు అడుగుతున్నారు. ప్రతి తరలింపుదారు విమానంలో ప్రయాణించడానికి రూ. 120,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. తల్లిదండ్రులెవరూ ట్యాబ్ తీసుకోమని అడగడం లేదు…ఆపరేషన్ గంగతో అభయహస్తం ఇచ్చింది కేంద్రం. శరవేగంగా భారతీయులను తరలిస్తోంది. సరిహద్దు దేశాల సహకారంతో సక్సెస్‌ఫుల్‌గా మిషన్ చేపడుతోంది. అయితే భారత్ దేశం మాత్రం తమ పౌరులను తరలించే పనిని చేపట్టినా.. చాలా రోజుల తర్వాత చైనా, అమెరికా వంటి పెద్ద దేశాలు ముందుకు వచ్చాయి. నిజానికి, ప్రభుత్వం చేయాల్సింది IAF C17లను వెంటనే సేవలో పెట్టడమే. యుద్ధ ప్రాంతం నుంచి తప్పించుకోవడానికి ఆహార సేవ అవసరం లేదు. ఒక C17 సమీపంలో 500 మంది వ్యక్తులను లోడ్ చేయగలదు. ఇది కరేబియన్‌కు వెళ్లే క్రూయిజ్ ఫ్లైట్ కాదు.

బదులుగా, షెడ్యూల్ చేయబడిన క్యారియర్‌ల నుండి చాలా ఎక్కువ నారో బాడీ 737లు, A320లు సహ-ఆప్ట్ చేయబడటంతో మంచి ఉద్దేశాలు చాలా వికృతంగా ఉన్నాయి. C17ని తీసుకురావడం తెలివైన పని. దాదాపు 13,000 మంది భారతీయులు చిక్కుకుపోయారని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇప్పుడు సగం మంది ఇంట్లోనే ఉన్నారు.

ఇప్పటికే నలుగురు కేంద్ర మంత్రులకు ఆపరేషన్‌ గంగా బాధ్యతలు అప్పగించింది కేంద్రం. వీకే సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు, హర్దిప్ సింగ్‌లు ఉక్రెయిన్ పక్క దేశాలకు వెళ్లి మన వారిని రప్పిస్తున్నారు. ఎంపిక చేసిన సెంటర్స్‌లో టెంపరరీ ఇమ్మిగ్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి.. మన వారిని ఇండియాకు తీసుకువస్తున్నారు..

విదేశీయులకు సైతం భారతీయ జెండానే అభయహస్తం..

రష్యా ఉక్రియెన్ పై దాడి చేస్తున్న సమయంలో చాలామంది భయబ్రాంతులకు గురి అవుతున్న సమయంలో విదేశీ వారికి కూడా భారతీయ జెండా అనే అభయహస్తం గా మారింది భారతీయ జెండా ని చేతిలో పట్టుకుని పాకిస్థాన్కు చెందిన విద్యార్థులు సైతం బార్డర్ దాటుతున్నారు.. అంతేకాకుండా రష్యా సైన్యం కూడా భారతీయ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరికి సహాయంగా నిలిచి బోర్డర్ కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు..