ఔటర్ రింగ్ రోడ్ టెండర్లపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్…!!

ఔటర్ రింగ్ రోడ్ టెండర్లపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. వెంటనే పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ అమ్రాపాలికి ఆదేశాలు జారీ చేశారు. సీబీఐ లేదా అదే స్థాయి మరో దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని సీఎం నిర్ణయించారు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది…..

ఓఆర్‌ఆర్ అవకతవలపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులకు సూచించారు. దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని హెచ్‌ఎండీఏ జాయింట్ కమీషనర్‌ ఆమ్రపాలిని ఆదేశించారు. సీబీఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు విచారణ బాధ్యతలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంది. ఓఆర్‌ఆర్ లీజు కాంట్రాక్టు కోసం గతంలో 4 సంస్థలు ముందుకు వచ్చాయి. ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం ద్వారా సుమారు రూ. 8వేల కోట్లను సమకూర్చుకునేందుకు హెచ్‌ఎండీఏ సంస్థ టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ (టీఓటీ)ని తీసుకువచ్చింది. గతేడాది కాలంగా దీనిపై కసరత్తు చేసిన హెచ్‌ఎండీఏ అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచింది. ఇందులో రూ. వేల కోట్లలో చేతులు మారాయని ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి..