పాలకుర్తిలో వాడివేడి పోటీ…!

పాలకుర్తి పాలిటిక్స్ మరింత హీటెక్కాయ్‌. మంత్రి ఎర్రబెల్లి టార్గెట్‌గా రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు ఎర్రబెల్లి ఓ నమ్మకద్రోహి, అవినీతిపరుడంటూ ధ్వజమెత్తారు.తనను జైల్లో పెట్టించింది ఎర్రబెల్లి దయాకర్ అంటూ.. శత్రువులతో చేతులు కలిపి టీడీపీకి ఎర్రబెల్లి నమ్మక ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. దయాకర్ రావు దందాలు చేసి వేలకోట్లు సంపాదించారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పాలకుర్తిలో దయాకర్‌కు బొందపెట్టాలన్నారు. అంతే స్ధాయిలో రేవంత్‌కి ఎర్రబెల్లి దయాకర్‌ కౌంటర్‌ ఇచ్చారు.

పాలకుర్తి నుంచి ఎన్నారై హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కోడలు యశస్విని రెడ్డి కాంగ్రెస్ తరఫున మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో తలపడుతున్నారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు…

ప్రముఖ ఎన్ఆర్ఐ దంప‌తులు హ‌నుమాండ్ల రాజేంద‌ర్ రెడ్డి, ఝాన్సీ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరడంతో పాల‌కుర్తిలో అనుహ్యంగా హస్తం బలం పెరిగింది. హనుమాండ్ల దంపతులు పాల‌కుర్తి సెగ్మెంట్ లో ముఖ్యంగా తొర్రూరు మండ‌లంలో ప‌లు సేవా కార్యక్రమాలతో ప్రజలకు సుప‌రిచితులు. తొర్రూరు మండ‌లం చెర్లపాలెం వాసి ఝాన్సీని కాంగ్రెస్ నుంచి బరిలోకి దింపేందుకు టీ పీసీసీ చీఫ్ ప‌క్కాగా స్కెచ్ వేశారు. దీంతో బ‌ల‌మైన అభ్యర్థి వచ్చారనే ఉత్సాహంలో పార్టీ శ్రేణులు ఉన్నాయి. పాల‌కుర్తిలో కాంగ్రెస్‌ బ‌లోపేతానికి చేరిక‌ల‌ను ప్రోత్సహించే ప‌నిలోనూ టీ పీసీసీ నాయకత్వం ఉంది. బీఆర్ఎస్ లో అసంతృప్తి, అస‌మ్మతి ముఖ్య నేత‌ల‌పైనా కాంగ్రెస్ ఫోకస్ చేసింది…పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓటమి ఎరుగని నేతగా పేరుతెచ్చుకున్న ఎర్రబెల్లికి ఈసారి చుక్కలు చూపించేందుకు కాంగ్రెస్ బారీ కసరత్తే చేస్తుంది..