పాలేరు బరి నుండి తప్పుకున్న వైఎస్ షర్మిల!!

YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల పాలేరు నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఖమ్మం రూరల్ మండలంలో తన క్యాంప్ నిర్వహించారు..
నాడు ఖమ్మం రూరల్ మండలంలో తన క్యాంప్ ఆఫీసుకి శంకుస్థాపన కూడా చేశారు. దీంతో ఆమె పాలేరు నుంచి కాంటెస్ట్ చేస్తారన్న వార్తల్లో సందేహం లేదని తేలిపోయింది. అయితే వైఎస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేయడం వల్ల ఎవరికి ఎక్కువ నష్టం ఉంటుంది. ఎవరిపై ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందన్న దానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆమె కాంగ్రెస్ లొ విలీనం కాకపోవడంతో ప్రస్తుతం ఒంటరిగానే బరిలో దిగాలని ఆలోచనతో వైఎస్ఆర్ టీపీ షర్మిల నిర్ణయించుకున్నారు.. అయితే ప్రస్తుతం ఆమె పాలేరు బరి నుండి తప్పుకుంటున్నారు వైఎస్ షర్మిల..అనే వార్తలు వినిపిస్తున్నాయి..!!..

కారణం ఇది కూడా కావచ్చు..

పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి.. వైయస్సార్ కి ఉన్న సంబంధం కూడా చాలా దగ్గర సంబంధం .. అలాంటి వ్యక్తి బరిలో ఉంటున్న సమయంలో వైఎస్సార్ టిపి తరఫున పోటీ చేయడం కూడా సరైన పద్ధతి కాదు అనే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా ఆ పార్టీ వర్గంలోని నాయకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు…. ఏది ఏమైనా వైఎస్ షర్మిల పాలేరు వారిలో ఉంటారా లేదా అనేది మరికొద్ది సమయంలో తెలుసిపోనున్నది..