పాల్తూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో వ్యక్తి నగ్నంగా తిరిగిన సంఘటనపై స్పందించిన పోలీసు అధికారులు..

అనంతపురం జిల్లా

*పాల్తూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో వ్యక్తి నగ్నంగా తిరిగిన సంఘటనపై స్పందించిన పోలీసు అధికారులు.*

పోలీసులు కొట్టారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.

ఇందులో వాస్తవం లేదు.. అడిషనల్ ఎస్పీ విజయ్ భాస్కర్ రెడ్డి

ఈనెల 1వ తేదీ రాత్రి సమయంలో చంద్రమోహన్ ని
విచారణ కోసం పిలిచాము.

అప్పటికే మద్యం మత్తులో ఉన్న చంద్రమోహన్ విచక్షణారహితంగా ప్రవర్తించాడు.

పోలీసులను దూషిస్తూ ఓ కానిస్టేబుల్ పై రాయితో దాడి చేశాడు.

ఆ తర్వాత అతని వదిలిపెట్టగా తనకు తాను దుస్తులు విప్పేసి బయటికి వచ్చాడు.

పోలీసులు అడ్డు చెప్పిన వినకుండా నగ్నంగా బయటికి వచ్చాడు.

ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ మా వద్ద ఉంది.

వాస్తవాలు తెలుసుకోకుండా పోలీసు శాఖపై దుష్ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటాం.