హైదరాబాద్ పబ్ నిర్హహకులకి తీవ్ర హెచ్చరికలు జారీ..!!!!

హైదరాబాద్ పబ్ నిర్హహకులకి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి. ఇకపై పబ్స్ లో పార్టీలకు మైనర్‌లను అనుమతిస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. కచ్చితంగా కస్టమర్ ఆధార్ కార్డు పరిశీలంచాలని హుకుం జారీ చేశారు. ఆల్కహాల్ లేని పార్టీలకైనా, ఆ పబ్ ప్రాంగణంలోకి అయినా.. మైనర్లను అస్సలు అనుమతించరాదని చెప్పారు. అలాగే కస్టమర్లను ఆకర్షించేందుకు మహిళలతో అశ్లీల నృత్యాలు వంటివి చేయొద్దని పబ్ మేనేజ్‌మెంట్లను డిసిపి శిల్పవల్లి హెచ్చరించారు…పబ్ యజమానుల తీరుపై మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి స్పందిస్తూ.. సమయంలోపే ఖచ్చితంగా పబ్ మూసేయాలి. మహిళా కస్టమర్ల తనిఖీ మహిళా ఉద్యోగులతో మాత్రమే జరగాలి. పబ్ ఆవరణలో ఎటువంటి వాగ్వివాదాలు జరగకుండా భద్రతా సిబ్బందిని నిమగ్నం చేయాలి. వినియోగదారులపై దాడి చేయకూడదు. చుట్టుపక్కవారికి ఇబ్బందులు రాకుండా.. మ్యూజిక్ సౌండ్స్ ని అదుపులో పెట్టాలని.. సౌండ్ పొల్యూషన్ గురించి పొరుగువారి నుండి ఫిర్యాదులు చాలా ఉన్నాయని.. అవి పునరావృతం కాకుండా చూసుకోవాలని.. అనుమతించిన డెసిబుల్‌లకు మించి సంగీతాన్నిప్లే చేయకూడదని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు మాదాపూర్‌ డీసీపీ