ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు.. అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు: పాడి కౌశిక్ రెడ్డి.

ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు.. అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు: పాడి కౌశిక్ రెడ్డి.

“అబద్ధాలు చెప్పొద్దు.. నిజాలు మాట్లాడాలి. ఇది రాజకీయాలు చేయాల్సిన వేదిక కాదు” అంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న సమయంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “అబద్ధాలు చెప్పొద్దు.. నిజాలు మాట్లాడాలి. ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు. ప్రజలకు వాస్తవాలు చెప్పండి” అని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో రాజకీయ విమర్శలు చేయడం సరికాదని, ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

⁠R9TeluguNews.com