పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్ర సర్కారు..

బ్రెజిల్‌ వేదాంత గురు జోనస్‌ మాశెట్టి, హరియాణాకు చెందిన పారాలింపియన్‌ గోల్డ్‌మెడల్‌ విన్నర్‌ హర్వీందర్‌ సింగ్‌, బిహార్‌కు చెందిన సామాజిక కార్యకర్త భీమ్‌ సింగ్‌ భవేశ్‌కు పద్మశ్రీ అవార్డు దక్కింది..పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం..

డా. నీర్జా భట్ల (ఢిల్లీ)

సామాజిక కార్యకర్త భీమ్ సింగ్ భవేశ్ (బిహార్)

సంగీత విద్వాంసులు దక్షిణామూర్తి (తమిళనాడు)

పండ్ల రైతు హంగ్ తింగ్ (నాగాలాండ్)

హరిమాణ్ శర్మ (హిమాచల్ ప్రదేశ్)

సల్లీ హోల్కర్ (మధ్యప్రదేశ్)

బేరు సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్)

విలాస్ దాంగ్రే (మహారాష్ట్ర)

వెంకప్ప అంబానీ సుగటేకర్ (కర్నాటక)

షేఖా ఎ.జే.అల సబాహ్ (కువైట్)

నరేన్ గురుంగ్ (నేపాల్)

జోనస్ మాశెట్టి (బ్రెజిల్).

*🔹పద్మ అవార్డ్స్ 2025*

దేశంలో గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మా అవార్డులను ప్రకటించింది.

విభిన్న రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలతో సత్కరించనుంది. గణతంత్ర వేడుకల సందర్భంగా.. రాష్ట్రపతి చేతుల మీదుగా వీరికి ఈ అవార్డులను బహుకరించనున్నారు.

* *పద్మశ్రీ అవార్డులు*

జోనస్‌ మాశెట్టి (వేదాంత గురు) – బ్రెజిల్‌
హర్వీందర్‌సింగ్‌ (పారాలింపియన్‌ గోల్డ్‌మెడల్‌ విన్నర్‌) – హరియాణా
భీమ్‌ సింగ్‌ భవేష్‌ (సోషల్‌వర్క్‌) – బిహార్‌
పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు)- పుదుచ్చేరి
ఎల్‌.హంగ్‌థింగ్‌ (వ్యవసాయం-పండ్లు)- నాగాలాండ్‌
బేరు సింగ్‌ చౌహాన్‌ (జానపద గాయకుడు) – మధ్యప్రదేశ్‌
షేఖా ఎ.జె. అల్ సబాహ్‌ (యోగా)- కువైట్‌
నరేన్‌ గురుంగ్‌ (జానపద గాయకుడు) – నేపాల్‌
హరిమన్‌ శర్మ (యాపిల్‌ సాగుదారు) – హిమాచల్‌ ప్రదేశ్‌
జుమ్దే యోమ్‌గామ్‌ గామ్లిన్‌ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్‌ ప్రదేశ్‌
విలాస్‌ దాంగ్రే (హోమియోపతి వైద్యుడు) – మహారాష్ట్ర
వెంకప్ప అంబానీ సుగటేకర్‌ (జానపద గాయకుడు) – కర్ణాటక
నిర్మలా దేవి (చేతి వృత్తులు) – బిహార్‌
జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు)- అస్సాం
సురేశ్‌ సోనీ (సోషల్‌వర్క్‌- పేదల వైద్యుడు)- గుజరాత్‌
రాధా బహిన్‌ భట్‌ (సామాజిక కార్యకర్త)- ఉత్తరాఖండ్‌
పాండి రామ్‌ మాండవి (కళాకారుడు) – ఛత్తీస్‌గఢ్‌
లిబియా లోబో సర్దేశాయ్‌ (స్వాతంత్ర్య సమరయోధురాలు) – గోవా
గోకుల్‌ చంద్ర దాస్‌ (కళలు)- పశ్చిమ బెంగాల్‌
సాల్లీ హోల్కర్‌ (చేనేత)- మధ్యప్రదేశ్‌
మారుతీ భుజరంగ్‌రావు చిటమ్‌పల్లి (సాంస్కృతికం, విద్య)- మహారాష్ట్ర
బతూల్‌ బేగమ్‌ (జానపద కళాకారిణి) – రాజస్థాన్‌
వేలు ఆసన్‌ (డప్పు వాద్యకారుడు) – తమిళనాడు
భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతర (తోలుబొమ్మలాట) – కర్ణాటక
పర్మార్‌ లావ్జీభాయ్‌ నాగ్జీభాయ్‌ (చేనేత)- గుజరాత్
విజయలక్ష్మి దేశ్‌మానే (వైద్యం)- కర్ణాటక
చైత్రం దేవ్‌చంద్‌ పవార్‌ (పర్యావరణ పరిరక్షణ)- మహారాష్ట్ర
జగదీశ్‌ జోషిలా (సాహిత్యం)- మధ్యప్రదేశ్‌
నీర్జా భట్లా (గైనకాలజీ) – దిల్లీ
హ్యూ, కొల్లీన్‌ గాంట్జర్‌ (సాహిత్యం, విద్య -ట్రావెల్‌) ఉత్తరాఖండ్‌
భారత దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన వివిధ రంగాలకు చెందిన వారికి కేంద్ర ఈ పురస్కారాల్ని అందిస్తుంటుంది. ఏటా గణతంత్ర దినోత్సవం రోజున వీటిని ప్రకటిస్తుంటారు. పద్మా అవార్డులు మూడు వర్గాలుగా విభజించి ఇస్తుంటారు. ఆయా రంగాల్లో వాళ్లు చేసిన కృషిని గుర్తిస్తూ.. ఈ మూడు విభాగాల్లో అవార్డులు అందిస్తుంటారు.

పద్మ విభూషణ (Padma Vibhushan) పౌర పురస్కారాల్లో అత్యున్నత పురస్కారం. వ్యక్తిగత సేవలు, ప్రత్యేక రంగాల్లో విశిష్ట కృషి చేసిన వారికి ఈ పురస్కారం అందిస్తుంటారు.

పద్మభూషణ్ (Padma Bhushan): దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం. దేశంలోని వివిధ రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు ఈ పురస్కారాన్ని అందిస్తుంటారు.

పద్మశ్రీ (Padma Shri) : మూడో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మశ్రీ అవార్డులను.. గొప్ప సేవలు, కళలు, సాహిత్యం, పౌర సేవలు, విజ్ఞానం, శాస్త్ర, సాంస్కృతిక రంగాలలో అసాధారణ కృషికి గుర్తింపుగా అందిస్తుంటారు.