పాండ్యా ఇంట్లో తీర‌నీ విషాదం

భారత క్రికెట్ ఆల్‌రౌండర్ పాండ్యా బ్రదర్స్ ఇంట్లో విషాదం నెల‌కొంది. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా కన్నుమూశారు. హిమాన్షు పాండ్యా కొన్నాళ్లుగా గుండె సంబంధిత అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. అయితే, ప్రస్తుతం హార్దిక్ ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకపోగా.. అతని సోదరుడు కృణాల్ పాండ్యా మాత్రం సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బరోడా కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే టోర్నీ నుంచి తప్పుకున్నాడు…