పాక్‌లో కలకలం.. ప్రధాని ఇమ్రాన్‌కు పదవీ గండం!.

*పాక్‌లో కలకలం.ప్రధాని ఇమ్రాన్‌కు పదవీ గండం!*

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం వచ్చి పడింది. పార్లమెంట్‌లో శనివారం ఆయన విశ్వాస పరీక్ష ఎదుర్కోబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాతో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో ఇంటెలిజెన్స్ ఛీప్ కూడా పాల్గొన్నారు. స్థానిక కాల మానం ప్రకారం గురువారం సాయంత్రం 7.30 గంటలకు ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ తాజాగా ప్రకటించారు.బుధవారం సెనెట్‌కు ఎన్నికల్లో ఇమ్రాన్ క్యాబినెట్‌లోని ఆర్థిక శాఖ మంత్రి.. ప్రతిపక్ష నేత యూసఫ్ రజా గిలానీ చెతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కేవలం 7 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. దీంతో పాక్ రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సరైన సమయం కోసం ఎప్పటినుంచో వేచి చూస్తున్న పాక్ ప్రతిపక్ష పార్టీలు.. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నాయి.