కాశ్మీర్ నుంచి షార్జాకు వెళ్లే విమానాల‌కు కూడా పాక్ అనుమ‌తులు ఇవ్వ‌లేదు…

ఇండియా పాక్ మ‌ధ్య స‌రిహ‌ద్దు వివాదం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్న‌ది. పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు కాశ్మీర్‌లో రెచ్చిపోతున్నారు. విధ్వంసాలు సృష్టిస్తున్నారు.పుల్వామా ఘ‌ట‌న త‌రువాత రెండు దేశాల మ‌ధ్య వివాదం మ‌రింత ముదిరిపోయింది. గ‌తంలో ఇండియా రాష్ట్ర‌ప‌తి విమానానికి పాక్ అనుమ‌తి ఇవ్వ‌లేదు. అప్ప‌టి నుంచి ఇండియా విమానాలు ఇత‌ర దేశాల మీదుగా ప్ర‌యాణం చేస్తున్నాయి. కాగా,ఇప్పుడు కాశ్మీర్ నుంచి షార్జాకు వెళ్లే విమానాల‌కు కూడా పాక్ అనుమ‌తులు ఇవ్వ‌లేదు.కాశ్మీర్ నుంచి షార్జా వెళ్లే విమానాలు ఉద‌య్‌పూర్‌, అహ్మ‌దాబాద్‌, ఒమ‌న్ మీదుగా షార్జా వెళ్తున్నాయి. ఇలా ప్ర‌యాణం చేయ‌డం ఖ‌ర్చుతో కూడుకున్న‌ది. ఐసీఏఓ రూల్స్ ప్ర‌కారం దేశంలో ల్యాండ్ కావాల్సిన అవ‌స‌రం లేకుండా గ‌గ‌న‌త‌లం వినియోగించుకునేందుకు అనుమ‌తులు ఇవ్వాల‌ని, కానీ, పాక్ ఆ రూల్స్‌ను ఫాలో కాకుండా అనుమ‌తులు ఇవ్వ‌డం లేద‌ని అధికారులు చెబుతున్నారు…