చైనా పెట్టుబడులు పెట్టిన ప్రాజెక్టుల మీదే పాక్ వేర్పాటువాదుల దాడులు..

R9TELUGUNEWS.COM.
బలూచ్‌ గెరిల్లాలు.. ప్రత్యేక రాష్ట్ర నినాదంతో పాక్‌ ప్రభుత్వంతో పోరాడుతున్నాయి. బలూచిస్థాన్‌లో గ్యాస్‌, విలువైన ఖనిజ సంపద ఉందని, పాక్‌ ప్రభుత్వం వాటిని అప్పనంగా చైనాకు కట్టబెడుతోందన్నది వాళ్ల అభ్యంతరం. తమ ప్రాంతం అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటోందని ఆరోపిస్తోంది. అందుకే చైనా పెట్టుబడులు పెట్టిన ప్రాజెక్టుల మీదే వేర్పాటువాదులు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో చైనా ఉద్యోగులు చనిపోతుండగా.. చైనా ఒత్తిడి మేరకు పాక్‌ సైన్యమోహరింపును ఎక్కువ చేస్తోంది.

దీనికి కారణం భారత అంటూ ఆరోపణలు..

బలూచిస్తాన్ చోరబాటుదారుల అంశంలోనూ పాక్‌ భారత్‌ మీదే ఆరోపణలు చేస్తోంది. భారత్‌ దన్నుతోనే వాళ్లు చెలరేగిపోతున్నారంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్న విషయం తెలిసిందే.