పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడులు, వందల మంది పాక్‌సైనికలు మృతి…

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ రక్తసిక్తమైంది.
మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. పంజూర్‌, నోష్కీ పోస్టులపై రెండు ఆత్మాహుతిదాడులు జరిగాయి. ఒక్కో దాడిలో ఆరుగురు సూసైడ్‌ బాంబర్స్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో వందల మంది పాక్‌సైనికలు మరణించినట్లు సమాచారం. కాగా, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చైనా పర్యటనకు ముందు ఈ దాడులు జరగడం పాక్‌ ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది..

అడుగు పెట్టకముందే ఇమ్రాన్‌ ఖాన్‌కు షాకిచ్చిన చైనా..

నుంచి మొదలుకాబోయే వింటర్‌ ఒలింపిక్‌ గేమ్స్‌ కోసం బీజింగ్‌(చైనా)కు వెళ్తున్నాడు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌. పనిలో పనిగా మరో రెండు రోజులు అక్కడే ఉండి వాణిజ్యపరమైన ఒప్పందాలపై చర్చించనున్నారు. చైనా పెట్టుబడులు ఎక్కువగా బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోనే పెడుతుందన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే తాజా దాడులపై చైనాకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఇమ్రాన్‌ ఖాన్‌కు ఎదురు కానుంది. రాత్రికి రాత్రే జరిగిన ఈ దాడితో పాటు గత మూడు నెలల పరిణామాలపై పాక్‌ పీఎం కార్యాలయాన్ని చైనా ప్రభుత్వం వివరణ కోరినట్లు సమాచారం. ఇక దాడికి తామే బాధ్యులమంటూ బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. సూసైడ్‌ బాంబర్‌ ఎటాక్‌లో యాభై మందికి పైగా చనిపోయినట్లు ప్రకటించగా.. తమ తరపున నష్టం మాత్రం ఐదుగురు అని పాక్‌ సైన్యం ప్రకటించుకుంది. చైనా పర్యటన నేపథ్యంలోనే తాము ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టం చేసింది…