టీ20 వరల్డ్ కప్ లో వరుస సంచనాలు చోటుచేసుకుంటున్నాయి. ఏమాత్రం గెలుపు అంచనాలు లేని కొత్త జట్లు కూడా ఈ మెగా టోర్నీలో బలమైన జట్లను మట్టి కరిపిస్తున్నాయి. ఈ దిశగా ఇప్పటికే వెస్టిండీస్ సిరీస్ నుంచి అవుట్ కాగా…అదే ప్రమాదం మరికొన్ని కీలక జట్లకు పొంచే ఉంది. గురువారం రాత్రి ముగిసిన లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. అంతగా పటిష్ట లైనప్ లేని జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది. అది కూడా ఒకే ఒక్క పరుగు తేడాతో పాక్ ఓడిపోవడం గమనార్హం. ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసిన జింబాబ్వే జట్టు మరో సంచలనాన్ని నమోదు చేసింది…
మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణిత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. జింబాబ్వే బాట్స్ మెన్లలో సేన్ విలియమ్స్ (31) అత్యధిక పరుగులు చేశాడు.131 పరుగుల స్వల్ప లక్ష్యంతో భరిలోకి దిగిన పాక్ జట్టు నిర్ణిత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయడంతో ఒక రన్ తేడాతో జింబాబ్వే విజయం సాధించింది. పాక్ బ్యాట్స్ మెన్లలో మసూద్ (44) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.జింబాబ్వే బౌలర్లలో సికందర్ రాజా మూడు వికెట్లు తీయగా బ్రాడ్ ఎవన్స్ రెండు వికెట్లు తీశాడు.మూజరాబాని, జోంగ్వే చేరో వికెట్ తీశారు…