విదేశాలలో ఉన్న బిచ్చగాళ్ళలో దాదాపుగా 90 శాతం మంది పాకిస్తాన్ వారే..!!

తాజాగా ఒక ప్రకటన ప్రకారం తెలుస్తున్నది ఏమిటంటే.. విదేశాలలో ఉన్న బిచ్చగాళ్ళలో దాదాపుగా 90 శాతం మంది పాకిస్తాన్ దేశానికి చెందినవారేనని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది చెప్పింది ఎవరో కాదు పాకిస్తాన్ ప్రభుత్వమే. ఈ ప్రకటనతో పాకిస్తాన్ ప్రజలు అంతా షాక్ కు గురవుతున్నారు. అంతే కాకుండా విదేశాలలో జేబు దొంగలుగా మారుతున్న వారిలోనూ పాకిస్తాన్ పౌరులు ఉన్నారంటూ తెలపడం మరో విశేషం.

ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలలో పాకిస్తాన్ కు చెందిన దేశస్థులు బిచ్చమెత్తుకుంటూ అరెస్ట్ అయ్యారని ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. పాకిస్తాన్ నుండి వీరంతా టూరిస్ట్ వీసా మీద బయట దేశాలకు వెళ్లి అక్కడ యాచకులుగా మారుతున్నారని సమచారం తెలిపింది.