హైదరాబాద్‌కు పాకిస్థాన్ క్రికెట్ జట్టు

అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు కట్టుదిట్టమైన భద్రత మధ్య బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. కెప్టెన్ బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టు ఏడేళ్ల తర్వాత భారత్‌కు తొలిసారిగా పర్యటన కోసం నగరానికి వచ్చింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రత్యేక బస్సులో ఎక్కి నగరంలోని ఓ స్టార్ హోటల్‌లోకి వెళ్లారు. బాబర్ అజామ్, మరికొందరు ఆటగాళ్లు కొంతమంది మద్దతుదారులు, మీడియా ప్రతినిధుల వైపు చేతులు ఊపుతూ కనిపించారు. కొంతమంది భద్రతా సిబ్బంది తమ మొబైల్ ఫోన్‌లలో ఆటగాళ్లతో ఫోటోలు కూడా తీశారు. స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ ఓ పోలీసు అధికారితో మాట్లాడుతూ చేస్తూ కనిపించాడు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పాకిస్థాన్ టీమ్ చేరుకుంది. అక్కడ నుంచి ప్రత్యేక బస్సులో వారు బస చేయనున్న హోటల్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బంది, ఇతర ప్రయాణికులు చేతులు ఊపుతూ పాకిస్థాన్ జట్టు సభ్యులకు స్వాగతం పలికారు. సెల్ ఫోన్లలో దృశ్యాలను బంధించేందుకు పోటీపడ్డారు.