పాకిస్థాన్‌ పరిస్థితి చూస్తే… మాకు తినడానికి సరైన ఆహారం…ఇక కశ్మీర్ ను ఎలా తీసుకుంటాం..!!కూడా లేదు…

పాకిస్తాన్ నియంత్రణలో కూడా ఉంది. దీనిని POK అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని పిలుస్తారు. ఈ ప్రాంతంపై తరచుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కాశ్మీర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అందులో ఒక పాకిస్తానీ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు.

https://www.instagram.com/reel/CyB0JomS_9k/?igshid=MWZjMTM2ODFkZg==

ఒక మహిళా రిపోర్టర్ ఒక వ్యక్తిని ‘కాశ్మీర్ ఎవరిది’ అని అడుగుతుంది. దీనికి ఆ వ్యక్తి కాశ్మీర్ .. కాశ్మీరీలకు చెందినదని సమాధానం ఇవ్వడం మీరు వీడియోలో చూడవచ్చు. అనంతరం మళ్ళీ రిపోర్టర్, ‘కాశ్మీర్ పాకిస్థాన్‌కి చెందుతుందని మేము అంటున్నాం’ అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ ‘కాశ్మీర్ పాకిస్థాన్‌గా ఎలా మారింది… భారత్‌లో కాశ్మీర్ ఉంది అని సమాధానం చెప్పాడు. మళ్ళీ రిపోర్టర్ మాట్లాడుతూ కాశ్మీర్ రెండు భాగాలుగా ఉందని.. భారత్‌లో 60 శాతం, పాకిస్థాన్‌లో 30 శాతం ఉందని, అదే సమయంలో 10 శాతం చైనాతో ఉందని కూడా చెప్పింది. అప్పుడు ఆ వ్యక్తి స్పందిస్తూ నో అలా కాదు.. కాశ్మీర్ ఇప్పుడు భారతీయులకే చెందుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ పరిస్థితి చూస్తే… మాకు తినడానికి సరైన ఆహారం కూడా లేదు.. ఇక కశ్మీర్ ను ఎలా తీసుకుంటాం అని అంటాడు.. అప్పుడు రిపోర్టర్ మీకు తెలుసు.. మాకు తెలుసు అందరికి తెలుసు కశ్మీర్ భారత్ కు చెందినది అని .. అయినా ఎప్పుడు పాకిస్తాన్ కు కశ్మీర్ చెందుతుందని ఎందుకు అంటారు అని అడుగుతుంటే.. వెంటనే ఆ వ్యక్తి.. ఎందుకతనే మేము పిచ్చివాళ్ళం కనుక సమాధానం చెప్పాడు. .వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది అంకితాగర్వాల్ 322 అనే ఐడితో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది, ఇది ఇప్పటివరకు 1.4 మిలియన్లు అంటే 14 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. 1 లక్ష 42 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. వివిధ రకాల కామెంట్స్ చేశారు.

ఒక వినియోగదారు పాకిస్థానీ వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ ‘అతను తెలివైనవాడు’ అని కామెంట్ చేయగా, మరొకరు ‘అతన్ని ప్రధానమంత్రిని చేయండి, అప్పుడే పాకిస్థాన్‌కు రొట్టెలు వస్తాయి’ అని రాశారు. అదేవిధంగా, మరికొందరు వినియోగదారులు కూడా ఈ పాకిస్థానీ వ్యక్తిని ‘సెన్సిబుల్’ అని పిలుస్తున్నారు, మరికొందరు ‘అతను పాకిస్తాన్ గురించి అలా నిజం మాట్లాడాల్సిన అవసరం లేదు.. అతను అవసరాలు తీర్చుకోలేకపోతున్నాడు’ అని అంటున్నారు.

ఇదీ ఎంత వరకు నిజము తెలియాలి…. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది… ఈ వీడియోలోని సారాంశాన్ని మాత్రమే కేవలం పోస్ట్ చెయ్యడం జరిగింది..