పాకిస్థాన్‌ను అడ్డాగా చేసుకుని ఉగ్ర‌వాద గ్రూపులు ఇండియాను టార్గెట్ చేస్తున్న‌ట్లు అమెరికా వెల్ల‌డి…

పాకిస్థాన్‌ను అడ్డాగా చేసుకుని ఉగ్ర‌వాద గ్రూపులు ఇండియాను టార్గెట్ చేస్తున్న‌ట్లు అమెరికా వెల్ల‌డించింది. పాక్‌లో ఉన్న అనేక మంది ఉగ్ర‌వాదుల‌పై ఆ దేశం ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌న్న‌ది. జేషే మ‌హ‌మ్మ‌ద్ వ్య‌వ‌స్థాప‌కుడు మ‌సూద్ అజార్‌, 2008 ముంబై పేలుళ్ల నిందితుడు సాజిద్ మిర్‌లు స్వేచ్ఛ‌గా పాక్‌లో తిరుగుతున్న‌ట్లు అమెరికా ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఉగ్ర‌వాదంపై రిలీజ్ చేసిన రిపోర్ట్‌లో ఈ విష‌యాన్ని తెలిపారు. ఉగ్ర‌వాదంపై రూపొందించిన రిపోర్ట్ గురించి అమెరికా మంత్రి ఆంథోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. ప్రాంతీయంగా ఉగ్ర‌వాద సంస్థ‌లు పాకిస్థాన్ నుంచి ఆప‌రేట్ అవుతున్న‌ట్లు తెలిపారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌ను టార్గెట్ చేస్తున్న ఆప్ఘ‌న్ తాలిబ‌న్‌, హ‌క్కానీ నెట్‌వ‌ర్క్‌లో పాటు ఇండియాను టార్గెట్ చేస్తున్న ల‌ష్క‌రే తోయిబా, జేషే మ‌హ‌మ్మ‌ద్‌లు కూడా పాకిస్థాన్ భూభాగం నుంచి త‌మ కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నాయ‌ని రిపోర్ట్‌లో తెలిపారు.