బంగ్లాదేశ్ వైపు కన్నెత్తి చూస్తే, పాకిస్తాన్ క్షిపణులు రంగంలోకి దిగుతాయని భారత్ కు పాక్ నేత హెచ్చరికలు…
భారత్, బంగ్లాదేశ్ మధ్య కొంతకాలం నుంచి వివాదం ముదురుతోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ పిచ్చి చేష్టలతో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలిగింది…
అయితే ఈ విషయంలో పాకిస్తాన్ నేతలు భారత్‌ను, బీసీసీఐని తప్పు పడుతున్నారు. బంగ్లాదేశ్ వైపు కన్నెత్తి చూస్తే, పాకిస్తాన్ క్షిపణులు రంగంలోకి దిగుతాయని భారత్ కు పాక్ నేత హెచ్చరికలు…
1971లో పాకిస్తాన్ దురాగతాల నుండి బంగ్లాదేశ్ ప్రజలను భారత ప్రభుత్వం విముక్తి చేసింది. కానీ నేడు, ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్ నాయకత్వంలో బంగ్లాదేశ్ మరోసారి అదే పాకిస్తాన్ గుప్పిట్లోకి వెళుతోంది. బంగ్లాదేశ్ ప్రజలపై ఇంత అణచివేతను కలిగించిన అదే దేశం ఇప్పుడు బంగ్లాదేశ్‌ను రక్షించడానికి ప్రతిజ్ఞ చేసినట్లు నటిస్తోంది. అదే సమయంలో బంగ్లాదేశ్ జోలికొస్తే ఊరుకునేది లేదంటూ భారతదేశాన్ని బెదిరిస్తోంది.
పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌కు సన్నిహితుడు, అతని పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) నేత కమ్రాన్ సయీద్ ఉస్మానీ భారతదేశాన్ని హెచ్చరించారు. ఒకవేళ భారతదేశం బంగ్లాదేశ్‌పై దాడి చేస్తే, పాకిస్తాన్ తన శక్తి మేరకు ఢాకాను సమర్థించి భారతదేశాన్ని ధీటుగా ఎదుర్కొని, దాడి చేస్తుందని అన్నారు.
కమ్రాన్ సయీద్ ఉస్మానీ వీడియోలో ఏం చెప్పారు?.
వాస్తవానికి, PML-N నేత కమ్రాన్ సయీద్ ఉస్మానీ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాకిస్తాన్ జెండాతో పాటు కమ్రాన్ వెనుక బంగ్లాదేశ్ జాతీయ జెండా కనిపిస్తుంది. ఈ వీడియోలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సన్నిహితుడు క్రమాన్ సయీద్ ఉస్మానీ భారతదేశాన్ని బెదిరించారు. “ఈ రోజు నేను రాజకీయ నాయకుడిగా కాదు. బంగ్లాదేశ్ నేల, చరిత్ర, త్యాగం, ధైర్యానికి సెల్యూట్ చేసే వ్యక్తిగా మాట్లాడుతున్నాను. 2021లో నేను ఈ ప్రచారాన్ని ప్రారంభించిన సమయంలో, ఎవరూ నాతో లేరు. కానీ నేడు, అల్ హమ్దులిల్లాహ్, బంగ్లాదేశ్,పాకిస్తాన్ రెండూ కలిసి ఉన్నాయి” అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి…