పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ లో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..!!

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై గోపిచంద్, రాశీ ఖన్నా జంటగా బన్నీ వాసు నిర్మాతగా మారుతి దర్శకుడిగా రూపొందించిన చిత్రం పక్కా కమర్షియల్. ఈ సినిమా జూలై 1వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ క్రమంలో ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్మించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…

వంకాయ కూర గురించి మరింతగా చెబుతూ.. మీరు కుర్రాళ్లు.. అలాంటి దానిని నోట్లో పెట్టుకొని చటుక్కున ఎందుకు కొరకాలనిపించలేదు. దానిని కొరికి నమిలి మింగేయాలి అంటూ నాతో చెప్పేవారు. ఇక చికెన్ తొడలను మరో రకంగా అభివర్ణిస్తూ భోజనాన్ని ఆస్వాదిస్తూ తినే వారు.. మాకు తినిపించేవారు అని రావు గోపాల రావును గుర్తు చేసుకొని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు…మీకు కుదిరితే నాతో ఒక సినిమా చేయాలి అని అన్నారు. దాంతో రావు రమేష్ ఆనందంతో మునిగిపోయారు. అయ్య బాబోయో అంటూ చేతులు జోడించారు. నాతో ఎందుకు చేయడం లేదు.. ఏ కారణం అయి ఉంటుందని అడిగితే.. నవ్వుల్లో మునిగిపోయారు. డైలాగ్ డెలివరీ చెప్పడంలో మీ నాన్న టైమింగ్‌ను మ్యాచ్ చేస్తుంటావు అని ప్రశంసల్లో ముంచెత్తారు..