పాలమూరు రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్…

*పాలమూరు రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్*
పట్టాలెక్కనున్న కాచిగూడ గుంటూరు ఎక్స్‌ప్రెస్.
మహబూబ్‌నగర్, గద్వాల మీదుగా గుంటూరు.
ఏర్పాట్లు చేస్తున్న రైల్వే అధికారులు.

_మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లా వాసులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా రద్దయిన కాచిగూడ – గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలును పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి రైలు పట్టాలెక్కనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఏప్రిల్ 1న గుంటూరు – కాచిగూడ ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుంది. మరుసటి రోజు 2వ తేదీన మధ్యాహ్నం 3.10 గంటలకు కాచిగూడలో బయలుదేరి షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, జోగులాంబ గద్వాల మీదుగా కర్నూలు, డోన్, గిద్దలూరు, మార్కాపురం మీదుగా మరుసటి రోజు ఉదయం 6.45కి గుంటూరు చేరుతుంది. కాచిగూడ గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కానుండడంతో మహబూబ్‌నగర్, గద్వాల జిల్లా వాసులు ఏపీ ప్రయాణం మరింత సులభం కానుంది._