నిండు జీవితానికి రెండు చుక్కలు…..

నిండు జీవితానికి రెండు చుక్కలు.

— నేటి నుంచి 1వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో కార్యక్రమం. అన్ని జిల్లాలకు చేరిన పోలియో వ్యాక్సిన్లు.

ఐదేండ్లలోపు చిన్నారులకు చుక్కల మందు..తొలి రోజు కేంద్రాల్లో,మిగిలిన రోజుల్లో ఇంటింటికీ వెళ్లి..
…పోలియో రహిత సమాజంగా మార్చేందుకు ప్రచారం చేపట్టిన వైద్య శాఖ.

పల్స్‌ పోలియోకు వేళైంది ఆదివారం గ్రామాల్లో చిన్నారులకు చుక్కల మందు వేసేందుకు వైద్యశాఖ సన్నద్ధమైంది. ఐదేండ్లలోపు చిన్నారులకు తొలి రోజు కేంద్రాల్లో.. మార్చి 1వ తేదీ వరకు మిగిలిన పిల్లలకి ఇంటింటికీ వెళ్లి మందు వేయనున్నారు. ఇప్పటికే జిల్లాకు వ్యాక్సిన్లు చేరాయి పుట్టుకతోచిన్నారులకు అంగవైకల్యం రాకుండా ఉండేలా నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించుకోవాలని అధికారులు విస్తృత ప్రచారం చేపట్టారు వంద శాతం లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పోలియో రహిత సమాజం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది చిన్నారులకు అంగవైకల్యం రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని చేపడుతున్నది. దేశంలో తొలిసారి గా 1972లో పోలియో చుక్కల మందు వేశారు చుక్కల మందును కనిపెట్టిన జానస్‌ హాల్క్‌ పుట్టిన రోజు (అక్టోబర్‌ 24)ను పోలియో అవగాహన దినోత్సవంగా జరుపుకుంటాం.. అపరిశుభ్రమైన ఆ హారం తీసుకోవడంవల్ల పోలియో వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తుంది రక్తంలో కలిసి నరాల్లోని జీవకణాలను బంధిస్తుంది. దీంతో కండరాలు బిగుసుకుపోయి క్రమంగా అవయవాలు చచ్చుబడిపోతాయి. ఇలా కేవలం వారం రోజుల్లోనే వ్యాధి తీవ్రతరమవుతుంది మొదటి దశలో ఆహారం, నీళ్ల ద్వారా వైరస్‌ కడుపులోకి చేరుతుంది రెండో దశ లో నరాల్లోకి.. మూడో దశలో కండరాలు, శ్వాసకోశం బలహీనపడి అవయవాలన్నీ చచ్చుబడుతాయి. ఈ వైరస్‌ ఒకటి, రెండేండ్ల చిన్నారులకే అధికంగా సోకుతుంది దీనికి మందులు లేవు. కేవలం వ్యాక్సినేషనే ఒక్కటే పరిష్కారం. ఇంతటి ప్రమాదకరమైన వ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఏడాది రెండు సార్లు పల్స్‌ పోలియో చుక్కల మందు వేస్తున్నారు. ప్రతి ఏడాది జనవరి, అక్టోబర్‌లో రెండు సార్లు వ్యాక్సిన్‌ వేస్తున్నారు.
కానీ గత జనవరిలో చుక్కల మందు వేయాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదాపడింది. ఈ క్రమంలో ఈనెల 27వ తేదీన అనగా రేపు ఆదివారం చుక్కల మందు వేయనున్నారు. బస్టాండ్లు, జనసం చారప్రాంతాల్లో, ప్రభుత్వ ఆసుపత్రులలో ఆదివారం పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి చుక్కల మందు వేయనున్నారు.పల్స్‌ పోలియోపై వైద్యశాఖ విస్తృతంగా ప్రచారం చేపడుతున్నది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకి పల్స్ పోలియో చుక్కలు వేయించండి నిండు జీవితాన్ని కాపాడండి.