పాన్ ఇండియన్ స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి వసూళ్లతో షాక్ అయ్యారు….!!!

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమాకు మొదటి రోజు ఊహించిన ఓపెనింగ్స్ రాలేదు. పాన్ ఇండియన్ స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా హిందీలోనూ దారుణమైన వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు అక్కడ కేవలం రూ. 2.4 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. రెండో రోజు మాత్రం రూ. 2.05 కోట్లు మాత్రమే వసూళు చేసింది. ఆరు రోజుల్లో కలిపి రూ. 8.40 కోట్ల షేర్.. (రూ. 21 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఒక రకంగా ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌కు ఇదే పెద్ద దెబ్బ అనే చెప్పాలి. మరోవైపు మిగిలిన రాష్ట్రాలలో సైతం ఈ సినిమాకు ఊహించిన కలెక్షన్స్ అయితే రాలేదు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రికార్డు కూడా క్రియేట్ చేయలేక చతికిలబడింది…ఒక్కసారి ఏరియా వైజ్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి.. రెండో రోజు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 12.32 కోట్లు షేర్ మాత్రమే వసూళు చేసింది. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.58 కోట్లు.. నాలుగో రోజు.. దారుణంగా పడిపోయి.. కేవలం రూ. 2.11 కోట్లు మాత్రమే వచ్చాయి. ఐదో రోజు.. రూ. 1.14 కోట్లు మాత్రమే వచ్చింది. ఆరో రోజు కేవలం రూ. 63 లక్షలు మాత్రమే వసూళు చేసింది. ఓవరాల్‌గా ఆరు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 52.27 కోట్లు (రూ. 81.50 కోట్ల గ్రాస్) వసూళ్లు వచ్చాయి. వసూళు చేసింది. హిందీ, ఓవర్సీస్ సహా మిగిలిన అన్ని ఏరియాల్లో కలిపి రూ. 57 లక్షలను మాత్రమే వసూళు చేసింది. ఆరు రోజుల్లో మొత్తంగా రూ. 26.13 కోట్లు మాత్రమే వసూళ్లును దక్కించుకుంది. మొత్తంగా ఆరో రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.20 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికొస్తే..