వేడెక్కుతున్నా పంజాబ్ రాజకీయం…కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ రాజీనామాల పర్వం..

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పంజాబ్​ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.
ఒక వైపు కాంగ్రెస్​ అభ్యర్థులు ఆయా స్థానాల నుంచి నామినేషన్లు దాఖలు చేస్తున్న తరుణంలో.. మరోవైపు రాజీనామాల పర్వం తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తుంది. తాజాగా, ఖిల్లా రాయ్​పూర్​కు చెందిన మాజీ ఎమ్మెల్యే జస్బిర్​ సింగ్ ఖాన్​గుర కాంగ్రెస్ పార్టీకి గుడ్​బాయ్​ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విటర్​ వేదికగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి తన రాజీనామా సమర్పించారు.తాను.. 20 ఏళ్లపాటు కాంగ్రెస్కు సేవచేసినట్లు తెలిపారు. అయితే, ఆయన ఏ పార్టీలో చేరతారో మాత్రం ప్రకటించలేదు. కాగా, జస్బిర్ సింగ్.. తండ్రి జగ్పాల్ కూడా కాంగ్రెస్కు చెందిన సీనియర్ నాయకుడు. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి మంత్రుల నుంచి స్థానిక నాయకుల వరకు వలసలు ఊపందుకున్నాయి…అదే వేదికలో చన్నీ, సిద్దూ.. ఇరువురు నాయకులు సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిన మరొకరు వారికి.. మద్దతు పలుకుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మరికొన్ని రోజుల్లో సీఎం అభ్యర్థి ఉత్కంఠకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్​లో ఫిబ్రవరి 20 నుంచి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. మార్చి 10 న ఓట్ల లెక్కింపు జరగనుంది…