పంజాబ్ కింగ్ కేజ్రీవాల్… కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదు..ఎగ్జిట్ పోల్స్…!!!

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. 117 స్థానాలకు గాను ఆప్ 76 నుంచి 90 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని తేల్చి చెప్పింది. అధికార కాంగ్రెస్ పార్టీకి 19 నుంచి 31 స్థానాలు దక్కనున్నాయని వెల్లడించింది. బీజేపీకి ఒకటి నుంచి 4, ఇతరులకు 7 నుంచి 11 స్థానాలు దక్కే అవకాశముంది. ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. అసలు ఫలితాలు ఈ నెల 10న వెల్లడౌతాయి…