ఒక్కసారిగా కుప్పకూలిన పార్కింగ్ ఏరియా.. కార్లు, బైక్లు ధ్వంసం..

ఒక్కసారిగా కుప్పకూలిన పార్కింగ్ ఏరియా.. కార్లు, బైక్లు ధ్వంసం

పంజాబ్ మొహాలిలోని ఓ పారిశ్రామిక ప్రాంతంలో ఒక్కసారిగా పార్కింగ్ స్థలం కుప్పకూలింది. అనంతరం భారీ గుంత ఏర్పడింది. దీంతో గుంతలో పడి సుమారు పది బైక్లు, రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఇండస్ట్రీయల్ ఏరియా, సెక్టార్ 83లో.. బుధవారం ఈ ఘటన జరిగింది. ప్రమాద స్థలాన్ని జిల్లా ఉన్నతాధికారులు సందర్శించి వివరాలు సేకరించారు. కుప్పకూలిన పార్కింగ్ స్థలం పక్కనే భవన నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఆ భవనానికి బేస్‌మెంట్ తవ్వుతుండగా ఈ ఘటన జరిగినట్లు వారు వివరించారు. ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపిన పోలీసులు.. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని చెప్పారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం..కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని దిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. విజయ్‌పార్క్‌ ఏరియాలో నాలుగు అంతస్తుల భవనం అందరూ చూస్తుండగానే నేలమట్టమైంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక స్థానికుడు భవనం పడిపోతుండగా వీడియో తీశాడు.
గుంతలో పడి సుమారు పది బైక్‌లు, రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ధృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాహనాలన్నీ గుంతలో పడిపోవడం వీడియోలో కనిపిస్తుంది. మొహిలీలోని సెక్టార్‌ 83లోని ఐటీ సిటీ ఇండస్ట్రియల్‌ ఏరియాలో బుధవారం మధ్యాహ్నం 12:45 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తెలుస్తోంది. సంఘటన సంమయంలో కుప్పకూలిన పార్కింగ్‌ భవనంలో అనేక మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు..