పంజాబ్ ముఖ్యమంత్రిగా 16వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఆమ్ ఆద్మీ నేత భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి చెందిన కీలక నేతల భద్రతను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.. రాష్ట్రంలో 122 మంది మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల భద్రత ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. మాన్ నిర్ణయంతో పలువురు కాంగ్రెస్, అకాలీదళ్, బీజేపీ నేతల సెక్యూరిటీ తొలగించనున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం గతంలో కేంద్ర హోం శాఖ ఆదేశించిన ప్రకాశ్ సింగ్ బాదల్ కుటుంబంతో పాటు కెప్టెన్ మాజీ సీఎంలైన అమరీందర్ సింగ్, చరణ్‌జిత్ సింగ్ చన్నీలకు మాత్రమే భద్రత కొనసాగనుంది…1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. శుక్రవారం మొహాలీలో జరిగిన ఆప్ ఎమ్మెల్యేల సమావేశంలో మాన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేల మద్దతను లేఖను గవర్నర్‌కి సమర్పించామని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరామని ఆప్ పంజాబ్ ఇన్చార్జి రాఘవ్ చద్దా మీడియాకు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే వేదిక గురించి సమాచారం ఇచ్చామన్నారు. భగవంత్ మాన్ స్వగ్రామంలో ఈ నెల 16న మధ్యాహ్నం 12.30 గంటలకు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. హర్పాల్ సింగ్ చీమా, అమన్ అరోరా, బల్జిdందర్ కౌర్, సరవ్‌జిత్ కౌర్ మనుకే, గుర్మీత్ సింగ్ మీత్ #హయర్, బుధ్ రామ్, కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్, జీవన్‌జ్యోత్ కౌర్, డాక్టర్ చరణ్‌జిత్ సింగ్‌లతో సహా పలువురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.