పేకాట ఆడిన సీఎం చన్నీ..వైరల్ గా మారిన వీడియో…

పంజాబ్ లో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. ఇప్పటికే అన్నీ పార్టీలు ప్రచారంలో తమదైన స్టైల్లో రెచ్చిపోతున్నాయి. కాగా అధికార కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి చరణ్ జిత్ సింగ్ చన్నీ కూడా ప్రజలను ఆకట్టుకునేందుకు తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. బర్నాలాలోని అస్పాల్ ఖుర్ద్ లో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో చన్నీ స్థానికులలో కలిసిపోయారు. స్థానికంగా క్రికెట్ ఆడుతున్న యువకులతో కలిసి చన్నీ సరదాగా క్రికెట్ ఆడారు. ఆ తర్వాత కొంతమంది వృద్ధులు పేకాట ఆడుతుండగా.. వారితో కలిసి పేకాట ఆడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ నెల 20న జరుగనున్న పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోటీ రసవత్తరంగా సాగనుంది. ఎన్నికలకు కొంతకాలం ముందు సీఎం పీఠం ఎక్కి చరణ్ జీత్ సింగ్ చన్నీనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాలనుకున్న పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధూకి నిరాశే ఎదురైంది…