హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి పంతంగి టోల్ ప్లాజా ల వద్ద వాహనాల రద్దీ..!!

సంక్రాంతి పండుగ సందర్భంగా సోoతూర్లకు ప్రయాణం అవుతున్న ప్రజలు…

భారీగా నిలిచిపోయిన వాహనాలు… పల్లకి పోదాం చలో చలో అంటూ పట్నం వాసులు సొంత ఊర్లో ప్రయాణం..

దింతో హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి పంతంగి టోల్ ప్లాజా ల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 టోల్ బూత్ ఉండగా, వీటిలో పండుగ సందర్భంగా హైదరాబాద్ నుండి విజయవాడకి 10 గేట్లను తెరిచిన జిఎంఆర్ అధికారులు.. ఫాస్ట్ టాగ్ దగ్గర ఏదైనా ఇబ్బందులు జరిగితే తొందరగా వాహనాలు పోవడానికి వీలుగా హ్యాండ్ లీడర్ సౌకర్యం అందుబాటులో ఉంచారు. ఒక్కక బూత్ ఒక మ్యాన్ పవర్ తో పాటు హ్యాండ్ రీడర్ సౌకర్యం కల్పించిన అధికారులు.. రోజుకి మామూలుగా అయితే 38 వేల వాహనాలు వెళ్తాయని.. ఈ పండుగ సందర్భంగా 45 వేల నుండి 60 వేల మధ్యలో వెళ్లే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు..