పాపికొండలకు బోటింగ్ నవంబర్ 7 నుండి పునఃప్రారంభం..

పాపికొండలకు బోట్ ట్రిప్స్ పునఃప్రారంభం సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశం నందు హాజరైన రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఇంచార్జ్ SP M. రవీంద్రనాథ్ బాబు, IPS.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాపికొండలకు బోటింగ్ కార్యకలాపాలు నవంబర్ 7వ తేదీ నుండి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ సి.హెచ్.హరి కిరణ్, IAS., నేతృత్వంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఇంచార్జ్ SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS హాజరైనారు.

ఈ సమావేశంలో కలెక్టర్ టూరిజం, పోలీస్ మరియు సంబంధిత భాగస్వాములైన శాఖల అధికారులతో ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలు, యాత్రికుల భద్రత, బోట్ టూర్ ఆపరేటర్లు, ఫెర్రీ ఆపరేటర్లు పాటించవలసిన నిబంధనలను తెలియజేసి, రాష్ట్ర ప్రభుత్వంచే నిర్దేశించిన నియమాలను తు.చ తప్పకుండా పాటించాలని, సిబ్బంది మరియు ప్రయాణికులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని, ముఖ్యంగా లైఫ్ జాకెట్ల పరిశుభ్రతకు సంబంధించి తగినన్ని COVID-19 నిబంధనలు, ప్రయాణికులు సామాజిక దూరం పాటించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు.