హోల్ సేల్ ధరల పెరుగుదల 10.7 శాతం ఉన్నందున అత్యవసర మెడిసిన్ల ధరలను 10.7 శాతం పెంచుకునేందుకు కేంద్రం అనుమతిచ్చిన నేపధ్యంలో పారసిటమల్ తో పాటు 898 మెడిసిన్ల రేట్లు 10.7 శాతం పెరిగాయి. భారత దేశ చరిత్రలో ఏకకాలంలో ఇంత పెద్ద మొత్తంలో అత్యవసర మెడిసిన్ల ధరలు పెరిగిన దఖలాలు లేవు. ఇప్పటి వరకు 2 శాతం పెరుగుదలే గరిష్టంగా ఉండేది. కాని ఇప్పుడు ఏకంగా 10 శాతానికి పైగా ధరలు పెంచేసారు. జ్వరం, ఇన్ఫెక్షన్, గుండె జబ్బులు, హైబీపీ, చర్మ వ్యాధులు, రక్తహినత, , ORS, పేయిన్ కిల్లర్లు, మల్టివిటమిన్ల కోసం వినియోగించే అన్ని మందుల ధరలు పెంచుకునేందుకు కేంద్రం అనుమతిచ్చినందున రోగులకు వైద్యం మరింత భారమవుతోంది.
రాజకీయ సభల్లో ధరల పెరుగుదలపై మాట్లాడని ఢిల్లి పెద్దలు..అత్యవసర మెడిసిన్ల ధరల పెంపు సందర్భంగా హోల్ సేల్ ధరల పెరుగుదల 10.7 శాతం ఉన్నట్లు ద్రువీకరించడం గొప్ప విషయం. అయితే హోల్ సేల్ ధరల పెరుగుదల 10.7 శాతం ఉంటే..ఇక రిటైల్ లో సరుకుల ధరలు అంత కన్నా ఎక్కువ పెరిగినట్లే కదా?
ఫార్మా కంపెనీలు నష్టపోకుండా ఉండాలంటే పెరిగిన ధరలకు అనుగుణంగా మెడిసిన్ల ధరలు ప్రభుత్వం పెంచింతే..మరి హెల్త్ సెస్ ఎందుకు వసూలు చేస్తున్నట్లు? దేని కోసం ఖర్చు చేస్తున్నట్లు?. ఇక గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హెల్త్ బడ్జెట్ కేవలం 200 కోట్లు మాత్రమే పెరిగింది. 2021-22 లో 86 వేల కోట్లు, 2022-23 లో 86 వేల 200 కోట్లుగా మోడి సర్కార్ ప్రతిపాదించింది. ఈ మొత్తంతో ఆయుష్మాన్ భారత్ కింద పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నామనడం ఎంత వరకు నిజం?