ప్యారిస్ను షేక్ చేసిన దోపిడీ దొంగలు.. లౌవ్రే మ్యూజియంలో నెపోలియన్ ఆభరణాల చోరీ!

ప్యారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో ఇవాళ తెల్లవారుజామున నెపోలియం కాలం నాటి ఆభరణాల చోరీ జరిగింది. దీంతో ఆ మ్యూజియాన్ని ఇవాళ మూసేశారు. ఈ మ్యూజియాన్ని ప్రతిరోజు దాదాపు 30 వేల మంది సందర్శిస్తారు. ఈ ఐకానిక్ మ్యూజియంలో ప్రపంచ ప్రఖ్యాత, చారిత్రక వస్తువులుంటాయి. మోనాలీసా ఒరిజినల్ చిత్రం కూడా ఇక్కడే ఉంటుంది.శాఖ మంత్రి లోరెంట్ నూనెజ్ చెప్పారు. దొంగలు హైడ్రాలిక్ ల్యాడెర్‌ను ఉపయోగించి మ్యూజియంలోకి ప్రవేశించి అమూల్యమైన ఆభరణాలను దోచుకున్నారని తెలిపారు. (Louvre)

సేన్ నది వైపుగా ముఖభాగం ఉండేలా ఇక్కడ ఓ భవన నిర్మాణం జరుగుతోందని, దాని నుంచే దొంగలు మ్యూజియంలోకి చొరబడ్డారని, వారు అపోలో గ్యాలరీకి చేరుకున్నారని తెలిపారు. అపోలో గ్యాలరీలో ఆ సమయంలో ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్ ను ప్రదర్శిస్తున్నారు. అంటే, ఇవి ఫ్రెంచ్ రాజవంశపు కిరీట ఆభరణాలు..

హైడ్రాలిక్ ల్యాడర్(hydraulic ladder), చైన్ రంపంతో మ్యూజియంలోకి చేరుకున్నారు. దొంగల దాడితో ప్రఖ్యాత మ్యూజియం మూత పడటం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.

లౌవ్రే మ్యూజియంలోకి చొరబడ్డ దోపిడీ దొంగలు.. అధికారులను, సందర్శకులను భయపెట్టారు. నెపోలియన్ Napoleonic కాలం నాటి విలువైన ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారని ఫ్రాన్స్ మంత్రి లారెంట్ న్యూనెజ్ తెలిపారు. ప్యారిస్ చరిత్రలో ఇది పెద్ద దోపిడీగా పేర్కొన్నారు.

పక్కనే నిర్మాణంలో ఉన్న భవంతపై నుంచి దొంగలు మ్యూజియంలోకి చొరబడ్డారు. అపోలో గ్యాలరీలోని రాజవంశీయుల ఆభరణాలను దోచుకున్నారు. కేవలం ఏడు నిమిషాల్లోనే ఉన్నదంతా దోచుకుని పారిపోయారు.

నెపోలియన్ కాలం నాటి తొమ్మిది ఆభరణాలను అపహరించినట్లు ఫ్రెంచ్ డైలీ లె పరిసైన్ ప్రకటించింది. వీటిల్లో ఒకటి మ్యూజియం వెలుపల లభించినట్లు మంత్రి వెల్లడించారు..

ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిస్ట్ లియోనార్డో డావిన్సీ చేతి నుంచి జాలువారిన మోనాలిసా పోట్రెయిట్ 1911 లో అపహరణకు గురైంది. రెండేళ్ల తర్వాత ఇటలీలో దొరికింది.

1983లోనూ ఈ మ్యూజియంలో దొంగలు పడి పలు వస్తువులను దోచుకున్నారు. ఆ వస్తువులను 2021లో తిరిగి రికవరీ చేశారు…