ఉగ్రవాద దాడికి ఎదురొడ్డి నిలిచి తమ ప్రాణాలను అర్పించిన భద్రతా సిబ్బందికి నివాళులు అర్పించిన ప్రముఖులు..

R9TELUGUNEWS.COM ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడిని నిలువరించి, తమ ప్రాణాలను అర్పించిన వీరులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నివాళులర్పించారు.

వారి అత్యున్నత త్యాగానికి దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందన్నారు. 2001 డిసెంబరు 13న పార్లమెంటుపై జరిగిన ఉగ్ర దాడిలో ప్రాణాలర్పించిన భద్రతా సిబ్బందికి రాష్ట్రపతి కోవింద్‌తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాళులర్పించారు.. 2001లో సరిగ్గా ఇదేరోజున ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడికి ఎదురొడ్డి నిలిచి తమ ప్రాణాలను అర్పించిన భద్రతా సిబ్బందికి నివాళులర్పిస్తున్నాను. వారి అత్యున్నత త్యాగానికి దేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ట్వీట్‌ చేశారు.