పార్లమెంట్‌ సమావేశాలకు డుమ్మా కొడుతున్న భాజపా ఎంపీలు.. పరిస్థితి ఇలానే ఉంటే పనిష్మెంట్ తప్పదంటున్న ప్రధాని మోదీ…

R9TELUGUNEWS.COM…. స్కూల్ పిల్లలు స్కూల్ కి వెళ్ళటానికి భయ పడి ఎలా అయితే బంద్ చేస్తారో… అదేవిధంగా కేంద్ర బిజెపి నాయకులు కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నారు..?
పార్లమెంట్‌ సమావేశాల్లో భాజపా ఎంపీల గైర్హాజరుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రధాని.. ఎంపీలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. ఎంపీలు ఇకనైనా తమ ప్రవర్తన మార్చుకోవాలని, లేదంటే మార్పులు తప్పవని మోదీ హెచ్చరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి…పార్లమెంట్‌ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవ్వండి. చిన్న పిల్లలకు చెప్పినట్లు ప్రతిసారీ దీని గురించి నేను ఎంపీలకు చెప్పడం బాలేదు. కనీసం పిల్లలు కూడా ఒక విషయాన్ని పదేపదే చెప్పించుకోవాలనుకోరు. ఇకనైనా మారండి. ఒకవేళ మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే.. సమయానుగుణ మార్పులు జరుగుతాయి’’ అని భాజపా ఎంపీలకు మోదీ వార్నింగ్‌ ఇచ్చినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ఎంపీల గైర్హాజరుపై మోదీ గతంలోనూ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఎంపీలు క్రమశిక్షణ పాటించాలని, అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని గతంలో కూడా సూచనలు ఇచ్చారు….భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం దిల్లీలోని అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగింది. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌ కాకుండా మరో చోట ఈ భేటీ జరగడం ఇదే తొలిసారి. సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మీడియాతో మాట్లాడారు. ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో క్రీడా పోటీలు నిర్వహించాలని ప్రధాని సూచించినట్లు తెలిపారు. అంతకుముందు సమావేశం ప్రారంభమైన తర్వాత జన జాతీయ దివస్‌ను పురస్కరించుకుని ఎంపీలు మోదీని సన్మానించారు…