ఈనెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ …

పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ట్విటర్‌ ద్వారా బడ్జెట్‌ సమావేశాల షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం రెండు విడతల్లో 66 రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు.జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 13 నుంచి ఏప్రిల్‌ 6 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఈ సమావేశాల్లో పలు బిల్లులకు చట్ట రూపం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుండగా.. ధరల పెరుగుదలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి…