నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..

గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సోమవారం నుంచి 5 రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో.. ప్రభుత్వం ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటుందా? అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఎజెండా ఇదీ అంటూ కొన్ని వివరాలను ప్రభుత్వం ప్రకటించినా అంతకు మించి ఏదో ఉందనే అన్ని వర్గాలు భావిస్తున్నాయి. అసలు ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల లక్ష్యమేంటి? ఎందుకు కేంద్ర ప్రభుత్వం వీటిని నిర్వహిస్తోంది? అనే విషయం అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది. ఆగస్టు 3న ఈ సమావేశాలపై ప్రకటన వెలువడినప్పటి నుంచీ ఈ ఉత్కంఠ కొనసాగుతోందిపార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల ఎజెండాపై నెలకొన్న సస్పెన్స్‌ వీడకముందే సమావేశాలకు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఘన చరిత్ర కలిగిన పార్లమెంట్‌ పాత భవనంలో సోమవారం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం మంగళవారం నుంచి కొత్త పార్లమెంట్‌లో సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం అఖిలపక్ష భేటీని నిర్వహించింది. 1946 డిసెంబరు 9న తొలిసారిగా జరిగిన పార్లమెంట్ సమావేశాల నుంచి మొదలు పెట్టి ఈ 75 ఏళ్ల ప్రయాణంపై చర్చించిఈ ప్రత్యేక సమావేశాన్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది..