*పార్లమెంటులో హోరెత్తిన నినాదాలు..
మారణకాండపై కేంద్ర ప్రభుత్వం చర్చ జరపాలని బీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం ఉభయ సభలు ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం కొన సాగింది.
మణిపూర్ హింసపై చర్చ జరపాలనంటూ బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు రాజ్యసభలో, లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు లోక్‌సభలో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అయినా స్పీకర్లు పట్టించుకోకపోవడంతో ఎంపీలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ ఓంబిర్లా లోక్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభం కాగానే ఎంపీలు మళ్లీ ఆందోళన కొన సాగించారు. మళ్లీ సభను స్పీకర్ 2 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఇప్పటికైనా కేంద్రం మొండివైఖరి వదిలి మణిపూర్‌లో శాంతి నెలకొల్పేందుకు తీసు కోవాల్సిన చర్యలపైన సమగ్ర చర్చ జరపాలని నామ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు…