పాతబస్తీ మతపెద్దల సంచలన నిర్ణయం..!

పాతబస్తీ మతపెద్దల సంచలన నిర్ణయం.

నిమజ్జనం నేపథ్యంలో మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీ వాయిదా

ఏకతాటిపైకి వచ్చిన మతపెద్దలు..

వచ్చే నెల 1న ర్యాలీ నిర్వహించాలని మతపెద్దల నిర్ణయం.

పాతబస్తీ మతపెద్దల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల28వ తేదీ రోజు గణేష్ నిమర్జనం.. అదే రోజు జరగాల్సిన మిలాద్ ఉన్ నబి పండగ సందర్భంగా చేపట్టే భారీ ర్యాలీని వాయిదా వేస్తూ మార్కజ్ మిలాద్ జూలూస్ కమిటీ తీర్మానించింది…ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ వివరాలను తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ మిలాద్ ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు మౌలానా హాఫిజ్ మొహ్మద్ ముజఫర్ హుసైనీ ఖాద్రీ , కమిటీ సభ్యులు, మత పెద్దలు పాల్గొన్నారు. ప్రజలు మతసామరస్యంతో పండగలు జరుపుకోవాలని కమిటీ సభ్యులు తెలిపారు…