తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలోకి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) ఎంటర్ అయిపోయారు. గురువారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్(Tamilisai Soundar Rajan)..పట్నం మహేందర్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రవాణా మంత్రిగా పనిచేసిన పట్నం మహేందర్ రెడ్డి.. గత ఎన్నికల్లో ఓడిపోయారు…దీంతో పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy)కి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్. రాబోయే ఎన్నికల్లో ఆయన తాండూరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినా కూడా.. తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి(Tamilisai Soundar Rajan)కే కేసీఆర్ చాన్స్ ఇచ్చారు. దీంతో పట్నం మహేందర్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చడానికే ఆయనను కేసీఆర్..ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మూడు నెలల ముచ్చటగా ఉండే ఈ మంత్రి పదవి ఎన్నికల తర్వాత కూడా అలాగే కంటిన్యూ అవుతుందా అనే చర్చలు అప్పుడే మొదలయ్యాయి.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.