బస్సు ప్రమాదం దురదృష్టకరం.. : పవన్

R9TELUGUNEWS.COM ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు పడి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా వారిలో డ్రైవర్‌తో పాటు 6 గురు మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అంతేకాకుండా వాగులో బస్సు పడిపోవడంతో కొందరు నీటిలో గల్లంతయ్యారు. మరి కొందరు తీవ్ర గాలయవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే ఈ ఘటనపై తాజాగా జనసేన అధినే పవన్‌ కళ్యాణ్‌ స్పందిస్తూ..
బస్సు ప్రమాదం నన్ను తీవ్రంగా కలిచివేసిందన్నారు.
అంతేకాకుండా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతి చెందిన కుటుంబాలు ప్రభుత్వం తక్షణమే ఎక్స్‌గ్రేషియాను మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రమాదంపై విచారణకు కూడా ఆదేశించాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు…