పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ హీరోలుగా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ

పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ హీరోలుగా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ బ్రో జూలై 28న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
Pawan Kalyan and Sai Dharam Tej starrer Movie
పీపుల్స్ వీడియో ఫ్యాక్టరీ నిర్మాణంలో సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి.

అయితే ఇటీవల విడుదలైన సాంగ్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ద్వారా అయితే అనుకున్నంత స్థాయిలో పాజిటివ్ అప్డేట్స్ ఏమీ పెరగలేదు. తమిళంలో సక్సెస్ అయిన వినోదయ సీతం రీమేక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించడం ద్వారా మార్కెట్లో కూడా డిమాండ్ గట్టిగానే ఉంది. అయితే బ్రో సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే దాదాపు 100 కోట్లకు పైగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇటీవలే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ నుంచి ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.