పవన్‌, రజనీకాంత్‌పై జోగి రమేష్‌ సంచలన వ్యాఖ్యలు..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి జోగి రమేష్‌ బీజేపీతో పెళ్లి టీడీపీతో కాపురం చేసే వ్యక్తి పవన్ అంటూ ఫైర్‌ అయ్యారు..

మేం ఎవ్వరితో పొత్తులు పెట్టుకోం అని స్పష్టం చేశారు.. పవన్ కి సత్తా ఉంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటూ సవాల్‌ చేశారు.. సన్నాసి అయితే జనసేనను టీడీపీలో కలిపేయాలి అంటూ హాట్‌ కామెంట్లు చేశారు.. అమాయకులు పవన్ ని సీఎం అంటున్నారు.. కానీ, చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌.. సీఎం అంటున్నాడన్న ఆయన.. టీడీపీకి పవన్‌ అమ్ముడుపోతాడు అని ఆరోపించారు.. అందరినీ చంద్రబాబుకి హోల్ సేల్‌గా అమ్మేస్తాడు అంటూ జనసేన శ్రేణులను హెచ్చరించిన ఆయన.. జనసేన అభిమానులు కూడా జగనన్న బాటలో నడవాలంటూ పిలుపునిచ్చారు..

ఇక, చంద్రబాబు వేదిక మీద ఉండగా హాజరయ్యాడంటే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు మానవత్వం లేదు అంటూ ఫైర్‌ అయ్యారు జోగి రమేష్‌.. రజనీకాంత్ కి సిగ్గుగా లేదా..? అని ప్రశ్నించిన ఆయన.. ఒక దొంగ చంద్రబాబు, ఇంకొక దొంగ రజనీకాంత్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు..