పద్మభూషణ్ అవార్డును తిరస్కరించిన మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం పద్మ అవార్డులను ప్రకటించింది.
అందులో భాగంగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యకు భారత విశిష్ట పురస్కారం పద్మభూషణ్‌ ప్రకటించింది కేంద్రం. అయితే, ఇప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్య పద్మభూషణ్‌ను స్వీకరించడానికి నిరాకరించారు . తాను పద్మభూషణ్ అవార్డును స్వీకరించబోనని ఓ ప్రకటనలో తెలిపారు..పద్మ అవార్డు సంగతి నాకు తెలియదు. దాని గురించి ఎవరూ చెప్పలేదు. ఒకవేళ నన్ను ఆ పురస్కారానికి ఎంపిక చేసి ఉంటే.. దాన్ని తిరస్కరిస్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు. బుద్ధదేవ్‌తో పాటు పార్టీ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నట్లు సీపీఎం వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి అవార్డులు స్వీకరించడం తమ విధానం కాదని ఆ పార్టీ.. ట్విటర్‌లో పేర్కొంది. తాము పనిచేసేది ప్రజల కోసమని, అవార్డుల కోసం కాదని తెలిపింది. గతంలో తమ పార్టీ సీనియర్‌ నేత ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ కూడా ఇదే రీతిలో అవార్డును తిరస్కరించారని వివరించింది.