గట్టుజాతర కు ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు పూర్తి.. మంత్రి జగదీష్ రెడ్డి..

*ప్రజలను ఐక్యం చేయడం లో పెద్ద గట్టు వంటి జాతర లు దోహద పడుతాయి..

*ప్రభుత్వ పరంగా పెద్ద గట్టుజాతర కు అన్ని ఏర్పాట్లు పూర్తి..

*బీఆరెస్ హయాం లో అన్ని కులాలు, మతాలకు సమ న్యాయం*

*భేరీలు వాయించి పెద్ద గట్టు జాతర ను షురూ.. చేసిన మంత్రి జగదీష్ రెడ్డి*

*వైభవంగా మకర తోరణం తరలింపు వేడుక*

*సూర్యాపేట లోని గొల్ల బజార్ , ఎల్లమ్మ గుడి లో ప్రత్యేక పూజలు నిర్వహించి, పెద్ద గట్టు పైకి మకర తోరణం తరలింపు యాత్ర ను ప్రారంభించిన మంత్రి*

*ఎంపి బడుగుల తో కలిసి భేరీ లు వాయించి సందడి చేసిన మంత్రి*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*సూర్యాపేట*
సమాజాన్ని క్రమపద్దతిలో నడపడం లో ఆయా ప్రాంతాలు, వర్గాల సంస్కృతీ సాంప్రదాయాల పాత్ర కీలకం అని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
ప్రజలను ఐక్యం చేయడం లో పెద్ద గట్టు వంటి జాతర లు దోహద పడుతాయన్న మంత్రి తెలంగాణ లో రెండవ అతి పెద్ద జాతర కు ప్రభుత్వం తరుపున అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. జాతర లో తొలి ఘట్టం అయిన మకర తోరణం తరలిపు ప్రక్రియను సూర్యాపేట లోని గొల్ల బజార్ ఎల్లమ్మ గుడి లో ప్రత్యేక పూజలు చేసి మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంబించారు. ఈ సందర్బంగా రాజ్యసభ సభ్యుడు బడుగుల తో కలిసి భేరీలు వాయించిన మంత్రి ఓ లింగా.. ఓ లింగా అంటూ సందడి చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వం లోని బీఆరెస్ హయాం లో అన్ని కులాలు, మతాలకు సమ న్యాయం కల్పించామని అన్నారు. రేపు రాత్రి కేసారం నుండి దేవర పెట్టే తరలింపు అనంతరం సోమవారం నుండి భక్తులు వస్తారని మూడు రోజులు పాటు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా , ఇతర రాష్ట్రాల నుండి కూడా 15 లక్షల మంది భక్తులు వస్తారని అన్నారు. ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. కార్యక్రమం లో పెద్ద గట్టు చైర్మన్ కోడి సైదులు తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.