పెద్దగట్టు హుండీలో రక్తంతో ప్రేమలేఖ..

ఐదు రోజులపాటు జరిగిన పెద్దగట్టు దురాజపల్లి జాతరలో గురువారం హుండీ లెక్కిస్తుండగా హుండీలో రక్తం తో రాసిన ప్రేమలేఖ అధికారులకు దొరికింది . లింగమంతుల స్వామి దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు తన ప్రేమ కు దేవుడి మద్దతు కోరుతూ లేఖ రాశారు. తాను ప్రేమించిన అమ్మాయి తో జీవితాంతం ఉండేలా దివించు స్వామి అంటూ రక్తం తో తెల్లని పేపరు పైన రాసి తన ప్రేమను కలకాలం ఉండేలా చూడాలని వేడుకోవటం అందరిని ఆశ్చర్య మునకు గురి చేసింది.