పెద్దపెల్లి జిల్లాలో దారుణ ఘటన. మధ్యప్రదేశ్‌కు చెందిన మైనర్‌ బాలికపై గ్యాంగ్ రేప్‌..

పెద్దపెల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన మైనర్‌ బాలికపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో పరిస్థితి విషమించి మృతిచెందింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా దుండగులు అంత్యక్రియలు పూర్తి చేశారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట శివారులో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.