పెద్దపల్లిలో రాహుల్ గాంధీ పర్యటనకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన టీపీసీసీ సభ్యులు, ఓదెల జడ్పిటిసి గంట రాములు యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ రెడ్డి, వేముల రామ్మూర్తి తదితరులు ముకుమ్ముడిగా రాజీనామాలు.
కాంగ్రెస్ పార్టీ ని జేబు సంస్థగా మార్చుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పర్సనల్ ఎజెండాతో పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిండు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సర్వేలను మార్చి తనకు అనుకూలంగా రిపోర్టు తెప్పించుకున్నాడు.
రాహుల్ గాంధీ స్వతహాగా మాట్లాడుతాలేదు…రేవంత్ రెడ్డి రాసిఇచ్చింది చదువుతారు.
రాహుల్ గాంధీ మాటలను నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ని కనుమరుగు చేసే కుట్ర జరుగుతోంది.
పార్టీలో గుర్తింపు లేనప్పుడు ఆత్మగౌరవం చంపుకొని ఉండలేము.
అందుకే మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నాం – గంట రాములు యాదవ్, సత్యనారాయణ రెడ్డి, వేముల రామ్మూర్తి.